ఈ నెల 7న సంక్షేమ భవన్ ముట్టడి - కెవిపిఎస్

 ఈ నెల 7న సంక్షేమ భవన్ ముట్టడి -   కెవిపిఎస్  .        
సాంఘిక సంక్షేమ భవనం ముట్టడి కార్యక్రమం ఈనెల 7వ తేదీన (కెవిపిఎస్) నల్గొండ  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరుగుతుందని కెవిపిఎస్ నల్గొండ  జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండేటి శ్రీను,  పాలడుగు నాగార్జున . పత్రికా ప్రకటన లో తెలుపారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని , మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు ప్రతి నెల వెయ్యి రూపాయలు పాకెట్ మనీ ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్స్ చార్జీలు పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా హాస్టల్స్ లో  మంచి నీటి సౌకర్యం మెరుగు పరచాలని, టాయిలెట్లు విద్యార్థులకు సరిపడా నిర్మించాలని, కనీసం ఫ్యాన్లు, లైట్స్ లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ లో ఉన్నటువంటి దళిత బహుజన విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని,  తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని దీనికి నిరసనగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్)  సాంఘిక సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులు మరియు సామాజిక ప్రజాసంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
      ఇటీవల మా సంఘం పోరాటం పలితంగా హస్టల్స్ పెండింగ్ బిల్లులు విడుదల అయ్యాయని వారు తెలిపారు.